మండలంలోని వేచరేణి, పోతిరెడ్డిపల్లి, నాగపురి, పెదరాజపేట, శభాష్ గూడెం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గన్నీ సంచులు, తూకం యంత్రాలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటిస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ మెరుగు కృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ తిరుపతితో పాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఐకేపీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి - మార్కెట్ కమిటీ చైర్మన్
Share:

సారాంశం
- కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి
ముఖ్య విషయాలు
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.
- కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గన్నీ సంచులు, తూకం యంత్రాలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు.
- మండలంలోని వేచరేణి, పోతిరెడ్డిపల్లి, నాగపురి, పెదరాజపేట, శభాష్ గూడెం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.
- ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటిస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
463ఆర్టికల్స్
1,13,988వ్యూస్






