గ్రామీణ పేదల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్ ఏసీడీపీఓ హరిత సూచించారు. మండలం ముండ్రాయి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ లో గురువారం నిర్వహించిన పోషణ మాసోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
అందుబాటులో ఉండే ఆకుకూరల్లో మంచి పోషకాలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా గర్భిణీలకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చామంతి, అంగన్వాడీ సూపర్ వైజర్ రజత, ఏఎన్ఎం రజని, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, అంగన్వాడీ టీచర్లు ఎన్ మాధవి, ఎస్ సృజన, ఆశవర్కర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.












