కొహెడ, 2026-11-16
రాబోయే యాసంగి 202627 సీజన్లో ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం, భూగర్భ జలమట్టాలు తగ్గే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యత ఇవ్వాలని కొహెడ మండల వ్యవసాయ అధికారి సతీష్ ఒక ప్రకటనలో కోరారు. వరి సాగుకు బదులుగా తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.
రాబోయే యాసంగి 202627 సీజన్లో ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం, భూగర్భ జలమట్టాలు తగ్గే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యత ఇవ్వాలని కొహెడ మండల వ్యవసాయ అధికారి సతీష్ ఒక ప్రకటనలో కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాసంగి సీజన్లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో వరి సాగు విస్తీర్ణంలో కనీసం 25 శాతం విస్తీర్ణాన్ని పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఇతర అనువైన ఉద్యాన, ఆయిల్ ఫామ్ పంటల సాగుకు మళ్లించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు.
రైతులు తమ భూముల స్వభావం, నీటి లభ్యతను బట్టి శనగ, కంది, పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు, వేరుశనగ తదితర పంటలను సాగు చేయడానికి ముందుకు రావాలని కోరారు.
క్రాప్ డేటా పోర్టల్లో నమోదు
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతు యాసంగిలో సాగు చేయదలచిన పంట, పంట విస్తీర్ణం, పంట రకం, పంట మార్పిడికి కావలసిన సదుపాయాలు, తదితర వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు () సేకరించి క్రాప్ డేటా పోర్టల్లో రైతువారీగా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.
కావున కొహెడ మండలంలోని రైతులందరూ తమ గ్రామానికి సంబంధించిన లను వెంటనే సంప్రదించి, పంటల మార్పిడికి సంబంధించిన వివరాలను అందించి, క్రాప్ డేటా పోర్టల్లో నమోదు చేయించుకోవాలని సూచించారు.
రైతువారీ వివరాల నమోదు ప్రక్రియను 16.11.2026, సోమవారం సాయంత్రంలోగా పూర్తి చేయాల్సి ఉన్నందున రైతులు గడువులోగా లకు సహకరించాలని కోరారు.
పంటల మార్పిడి ప్రాముఖ్యత
నీటి వనరులను సంరక్షించుకోవడం, కరువు పరిస్థితుల్లో పంట నష్టాలను తగ్గించుకోవడం, రైతుల ఆదాయాన్ని కాపాడుకోవడంలో పంటల మార్పిడి ఎంతో కీలకమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రైతులు, గ్రామ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు వ్యవసాయ శాఖకు సహకరించాలని మండల వ్యవసాయ అధికారి విజ్ఞప్తి చేశారు.

