మద్దూరు, 10 November
మద్దూరు లో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు
తెలంగాణ ప్రజా కవి, రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ ప్రథమ వర్ధంతి వేడుకలను సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అందెశ్రీ స్వస్థలమైన మండలంలో ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల జీవన పోరాటాలను తన కలం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప ప్రజాకవి అందెశ్రీ అని కొనియాడారు. తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, ప్రజల ఆకాంక్షలను తన రచనల్లో ప్రతిబింబించిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అయితే, అందెశ్రీ ఆశయాలు, సాహిత్య విలువలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.


