జిల్లా బీఆర్ఎస్ యువ నాయకుడు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన కిలాషాపురం గ్రామానికి చెందిన శివరాత్రి రవి కుటుంబాన్ని పరామర్శించి, రూ.6 వేల ఆర్థిక సహాయం అందించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం అని ఆయన పేర్కొన్నారు.
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం అని చాటుతూ బీఆర్ఎస్ జిల్లా యువ నాయకుడు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి మృతుడి కుటుంబానికి చేయూతనందించారు. మండలంలోని కిలాషాపురం గ్రామానికి చెందిన శివరాత్రి రవి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాకేష్ రెడ్డి వెంటనే మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, వారి బాధలో పాలుపంచుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, రూ.6 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలిచి, మానవత్వాన్ని చాటుకున్న రాకేష్ రెడ్డిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యాదగిరి, సర్పంచ్ సంగ కవితఅశోక్, కూసుబాయ్ తండా సర్పంచ్ రాజేందర్ నాయక్, సొసైటీ డైరెక్టర్ వీరస్వామి, నారగోని రవిచంద్ర, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

