నర్మెట్టలో రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు చాకలి ఇలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆమె ఆశయాల సాధనకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు ప్రజాపురం పాండయ్య, నరసింహ, రాజేష్, ఆంజనేయులు, రమేష్, మల్లేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.












