మండల కేంద్రంలోని తహాసీల్థార్ కార్యాలయంలో మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెండ్లి జగన్మోహన్ రెడ్డి, మండల సోషల్ మీడియా కన్వీనర్ కొండ కుమార్ తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేయనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందించే కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఉపసర్పంచులు, మాజీ వార్డు సభ్యులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మండల, గ్రామ యూత్ అధ్యక్షులు, మాజీ డైరెక్టర్లు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, వివిధ గ్రామాల సోషల్ మీడియా ఇన్చార్జీలు కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సైతం కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు హాజరుకావాలని కోరారు.












