మండలం అబ్దుల్‌నాగారంలో వీధి దీపం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని హనుమకొండ ప్రధాన రహదారిపై రాముని సత్తయ్య కిరాణా దుకాణం వద్ద వీధి దీపం లేకపోవడంతో రాత్రివేళల్లో తీవ్ర చీకటి నెలకొంటోంది. దీంతో ఈ మార్గంలో వెళ్లే పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలోని మహిళలు, బాలికలు బొడ్డెమ్మ పాటలు పాడుతూ వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే వీధి దీపం లేకపోవడంతో చీకటిలో వేడుకలు నిర్వహించాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను రాత్రివేళల్లో బయటకు పంపేందుకు భయంగా ఉందని తెలిపారు. చీకటి కారణంగా ప్రమాదాల భయం కూడా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. వీధి దీపం ఏర్పాటు చేయాలని పలుమార్లు సంబంధిత అధికారులకు, గ్రామ సర్పంచ్‌కు తెలియజేసినా సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాముని సత్తయ్య కిరాణా దుకాణం వద్ద వెంటనే వీధి దీపాన్ని ఏర్పాటు చేయాలని గ్రామ మహిళలు, ప్రజలు కోరుతున్నారు.
అబ్దుల్‌నాగారంలో వీధి దీపం లేక చీకట్లు.. బొడ్డెమ్మ వేడుకలకు ఆటంకం
Share:

సారాంశం
రాత్రివేళల్లో రాకపోకలకు ఇబ్బందులు.. అధికారులకు గ్రామస్తుల మొర
ముఖ్య విషయాలు
- గ్రామంలోని హనుమకొండ ప్రధాన రహదారిపై రాముని సత్తయ్య కిరాణా దుకాణం వద్ద వీధి దీపం లేకపోవడంతో రాత్రివేళల్లో తీవ్ర చీకటి నెలకొంటోంది.
- బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలోని మహిళలు, బాలికలు బొడ్డెమ్మ పాటలు పాడుతూ వేడుకలు నిర్వహిస్తున్నారు.
- అయితే వీధి దీపం లేకపోవడంతో చీకటిలో వేడుకలు నిర్వహించాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- మండలం అబ్దుల్‌నాగారంలో వీధి దీపం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

నాగపురి కిషన్
Reporter
Tharigoppula
5ఆర్టికల్స్
170వ్యూస్










