రక్తదాన శిబిరంలో పాల్గొన్న వెల్దండ యువకులు
రక్తదాతలు మరొకరికి ప్రాణదాతలుగా నిలుస్తారని జనగామ డిసిపి రాజమహేంద్రనాయక్ అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుండి యువకులు, పోలీసులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డిసిపి రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. ప్రమాద సమయాల్లో పలువురికి రక్తం అవసరం ఉంటుందని, అటువంటి వారికి తమ వంతు సహకారంగా రక్తాన్ని బహుకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా, రక్తాన్ని దానం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ ఇన్చార్జి ఏసిపి బీమ్ శర్మ, సీఐ సత్యనారాయణ రెడ్డి, నర్మెట్ట ఎస్సై రఘుపతి, యూత్ సభ్యులు కొన్నే సంపత్, మంద శ్రీకాంత్ రెడ్డి, వంగ క్రిష్ణాకర్, యిట్టబోయిన రాజు, కాసర్ల రాజు, చేర్యాల ఆంజనేయులు, చేర్యాల మధు తదితరులు పాల్గొన్నారు.












