ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు వివరిస్తున్న బిజెపి పార్టీ నాయకులు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బీజేపీ తరిగొప్పుల మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం ఒక కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్ అధ్యక్షతన, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరాజ్ మండలంలోని ప్రముఖులు, ఓటర్లను కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా శివరాజ్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి వాస్తవాలను వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, అర్హులైన ప్రతి ఓటరు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. పారదర్శకమైన ఓటర్ల జాబితాతో ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువమోర్చా అధ్యక్షుడు సిలువేరు వెంకటేష్ గౌడ్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు ఏడెల్లి రాంనరసింహారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పబ్బోజు రామ్ బ్రహ్మచారి, కొన్నిరాజు, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు కవటి రాజు తదితరులు పాల్గొన్నారు.

