కొమురవెల్లి, 15 November
రైతుబంధు, రైతుబీమా అమలు చేయాలి, సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలి: పచ్చిమడ్ల స్వామి గౌడ్
మండలంలోని రసులాబాద్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పచ్చిమడ్ల అనూష, పచ్చిమడ్ల స్వామి గౌడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.
ప్రభుత్వం ఇప్పటికే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ, ఏ మార్కెట్లోనూ వడ్లు కొనడం లేదని, కావున ఇప్పటికైనా రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వడ్లు కొనాలని ప్రభుత్వానికి తెలియజేశారు. అలాగే సన్నవడ్లకు రూ.500 బోనస్ కూడా వెంటనే ఇవ్వాలని కోరారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుబంధు, రైతుబీమా అందాయని, కానీ ఇప్పుడు ప్రభుత్వం మూడుసార్లు రైతుబంధు ఇవ్వలేదని, రైతుబంధు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని అన్నారు. ఎన్నికల కోసం కాకుండా, రైతు సాగు చేసుకునే సమయంలో ఇస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. అలాగే రైతుబీమా కూడా ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్, ఉపసర్పంచ్ సుదర్శన్, చైర్మన్ మెరుగు కృష్ణ, మాజీ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్, వార్డు సభ్యులు బహదూర్, అనేబోయిన మల్లేశం, దుంబాల శ్రీకాంత్, పశ్చిమడ్ల మంజుల, పచ్చిమడ్ల రాధిక, లక్ష్మీ, పరుశురాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, గ్రామ రైతులు, గ్రామ ప్రజలు, హమాలి సంఘం కార్మికులు పాల్గొన్నారు.


