హైదరాబాద్, 16 November
ప్రజల గొంతుకగా, సమాజ మార్పునకు పత్రికా రంగం కీలకమని ప్రకటన
ప్రజల గొంతుకగా మారే ప్రతి అక్షరం, సమాజ మార్పుకు నాంది పలికే ప్రతి వార్తతో జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. ఓరుగల్లు న్యూస్ దినపత్రిక నిజం కోసం, ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపింది. అక్షరమే ఆయుధం, కలమే సాక్ష్యం. ప్రజల సమస్యలే మా అజెండా. నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడమే పత్రికా రంగం యొక్క అసలైన బాధ్యత అని పేర్కొంది.
సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ, ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ, ప్రజలకు, పాలకులకు మధ్య వారధిగా నిలుస్తున్న పత్రికా రంగం సేవలు ప్రజా సమస్యల పరిష్కారానికి, సమాజ అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంతో విలువైనవని ఓరుగల్లు న్యూస్ అభిప్రాయపడింది.
వార్త రాయడం కేవలం వృత్తి మాత్రమే కాదని, ప్రజల పక్షాన నిలబడే ఒక సామాజిక బాధ్యత అని తెలిపింది. ప్రతి అక్షరంలో నిజాయితీ, ప్రతి వార్తలో వాస్తవం, ప్రతి కథనంలో ప్రజా ప్రయోజనం ఇదే తమ పత్రికా ప్రయాణమని పేర్కొంది. ఈ సందర్భంగా అందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది.



