పర్వతగిరి, 16 November
రికార్డుల నిర్వహణ, నేర నియంత్రణపై పోలీసులకు పలు సూచనలు
వార్షిక తనిఖీల్లో భాగంగా ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ ఐపీఎస్ పర్వతగిరి పోలీస్ స్టేషన్ను సందర్శించి, తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కు చేరుకున్న డీసీపీకి పర్వతగిరి పోలీస్ ఇన్స్పెక్టర్ ఆర్. సంతోష్ పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్) సమర్పించారు.
తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను డీసీపీ పరిశీలించారు. ఈ ఏడాది నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు, దర్యాప్తు పురోగతి, దొంగతనం కేసుల ఛేదన, నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
నేరాల నియంత్రణతో పాటు, కేసుల దర్యాప్తులో వేగం పెంచి, నేరస్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యలను పూర్తిగా, ఓపికగా విని, అర్థం చేసుకుని, నిబంధనల ప్రకారం తగిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.



