సిద్దిపేట, 16 November
సంవత్సరాల తరబడి కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలకు ప్రజా పాలన ప్రభుత్వం చేయూత పింఛన్లు అందిస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో 2,477 మంది లబ్ధిదారులకు కొత్త పింఛన్ల ప్రొసీడింగ్స్‌ను అందజేశారు.
సంవత్సరాల తరబడి కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలకు ప్రజా పాలన ప్రభుత్వం చేయూత పింఛన్లు అందిస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని నిమ్రా గార్డెన్స్‌లో జిల్లా కలెక్టర్ కె. హైమావతితో కలిసి నియోజకవర్గానికి చెందిన 2,477 మంది లబ్ధిదారులకు (వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు) కొత్త చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిధులు లేకుండా కొత్త పింఛన్లు ఎలా ఇస్తారని గతంలో పలువురు విమర్శించినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి కొత్తగా పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. జిల్లాలో 12 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దీపావళి రోజున ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో పండుగ జరుపుకున్నామని, వారి కళ్లలో ఆనందం చూసి సంతోషించానని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఇళ్లను నిర్మించి పేదలకు అందించామని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుల కుటుంబానికి నెలకు సుమారు రూ.1,200 విద్యుత్ బిల్లు ఆదా అవుతోందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, ఈ పథకం అమలుకు మూడేళ్లలో ప్రభుత్వం రూ.12 వేల కోట్లను ఆర్టీసీకి అందించిందని వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 20 లక్షల మంది పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించామని, పేదలు కడుపునిండా తినేందుకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. లో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని, అర్హులైన ప్రజలకు కొత్త రేషన్ కార్డులు అందించామని పేర్కొన్నారు.
ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఈ నెల 19న జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు లక్షల ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నారని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ, జిల్లాలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలతో కలిసి పాల్గొనడం తన అదృష్టమన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్వీకరించిన 12 వేల దరఖాస్తులను పరిశీలించి, జిల్లా వ్యాప్తంగా 11,300 మంది చేయూత పింఛన్ల లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని సాగునీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున రబీ సీజన్లో రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఖరీఫ్‌లో పండించిన వరి ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 420 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ, పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పింఛన్లతో పాటు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.


