చేర్యాల, 17 November
సిద్దిపేట జిల్లా మండలం ఆకునూరు గ్రామంలో కారు ఢీకొని కోడి మృతి చెందిన ఘటనలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదం చివరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది.
సిద్దిపేట జిల్లా మండలం ఆకునూరు గ్రామంలో కారు ఢీకొని కోడి మృతి చెందిన ఘటనలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదం చివరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. ఆకునూరు గ్రామానికి చెందిన పౌడాల రాములుకు చెందిన కోడి ఇంటి ఆవరణలో తిరుగుతుండగా, మల్లోజు రవికుమార్ తన కారులో వస్తూ కోడిని ఢీకొట్టాడు. కోడి చనిపోవడంతో దాని యజమాని రాములు, డ్రైవర్ రవికుమార్‌ను నిలదీశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. దీంతో పౌడాల రాములు దంపతులు చనిపోయిన కోడితో సహా పోలీస్ స్టేషన్‌కు వచ్చి రవికుమార్‌పై ఫిర్యాదు చేశారు.







