సంఘం (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 17
ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కెమ్మసారం అశోక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు.
ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కెమ్మసారం అశోక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేటలోని కోమటి చెరువు అడ్వెంచర్ పార్కులో ఆయన మాట్లాడుతూ.. 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. ఈనెల 19న సిద్దిపేటలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో, రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా దివ్యాంగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై మాట్లాడాలని ఆయన కోరారు.
హామీల అమలుకు డిమాండ్
దివ్యాంగుల సమస్యలను గుర్తించి, పింఛన్ పెంపు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వంటి హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడతామని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు.







