హుస్నాబాద్, 18 November
మండలంలోని గుబ్బడి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ లో రైతు మేడబోయిన పోచయ్య అలియాస్ పవన్ ఇంట్లో దాచిన రూ.2.50 లక్షల నగదు, విద్యార్థి ధ్రువపత్రాలు, దుస్తులు, గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయి. స్థానికులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా గుబ్బడి గ్రామంలో భారీ నష్టం సంభవించింది. గ్రామస్తుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన రైతు మేడబోయిన పోచయ్య అలియాస్ పవన్ ఉదయం పొలం వద్ద పనులు చేసుకుంటుండగా, ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు దట్టమైన పొగ, మంటలు రావడాన్ని గమనించి, వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో బీరువాలో దాచిన వరి ధాన్యం అమ్మగా వచ్చిన రూ.2.50 లక్షల నగదు, దుస్తులు, పదవ తరగతి, ఇంటర్ తో పాటు ఇతర ధ్రువపత్రాలు కాలి బూడిదయ్యాయి. అలాగే కూలర్, వాటర్ ప్యూరిఫైయర్, వాషింగ్ మిషన్, ఇంటి తలుపులు కూడా దెబ్బతిన్నాయి. పోలీసులు ా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రభుత్వం తమను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని బాధిత కుటుంబం కోరింది.


