మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నా ఖురెల్సుఖ్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
మంగోలియాలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు ఉఖ్నా ఖురెల్సుఖ్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు న ప్రకటించారు. ప్రభుత్వ రైల్వే ప్రాజెక్టులో భారీ మొత్తంలో లంచం తీసుకున్నారంటూ ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. విచారణకు సహకరిస్తానని వెల్లడించారు.
25 మిలియన్ డాలర్ల ఆరోపణల వివరాలు
2019లో ఖురెల్సుఖ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో టవాంటోల్గోయ్గాషున్సుఖైట్ రైల్వే ప్రాజెక్టు కాంట్రాక్టును బోడి ఇంటర్నేషనల్ సంస్థకు కేటాయించడంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఆయన 25 మిలియన్ డాలర్లు లంచంగా పొందారని మాజీ ఉలాన్బాటర్ మేయర్ న్యాంబాటర్ ఖిష్గీ ఆరోపించారు. అయితే బోడి ఇంటర్నేషనల్ సంస్థ ఈ ఆరోపణలను ఖండించింది.
రాజీనామాకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి
2021లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఖురెల్సుఖ్.. తనపై వచ్చిన ఆరోపణల నిజానిజాలు తేలాలనే ఉద్దేశంతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఆయన రాజీనామా అమల్లోకి రావాలంటే 126 మంది సభ్యులున్న మంగోలియా పార్లమెంట్ ఆమోదం అవసరం. ఈ పరిణామం ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ముఖ్యాంశాలు: - మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నా ఖురెల్సుఖ్ రాజీనామా ప్రకటన. - ప్రభుత్వ రైల్వే ప్రాజెక్టులో 25 మిలియన్ డాలర్ల లంచం ఆరోపణ. - ఆరోపణలను ఖండించిన అధ్యక్షుడు. - విచారణకు సహకరిస్తానని వెల్లడి. - రాజీనామాకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి.


