ఢిల్లీలోని రామలీలా మైదానంలో నిర్వహించనున్న భారీ ర్యాలీకి సంబంధించి చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. ఈ ర్యాలీ ద్వారా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్ చేయనుంది.
ఢిల్లీలోని రామలీలా మైదానంలో నిర్వహించనున్న భారీ ర్యాలీకి సంబంధించి చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహణ, భద్రత, ఇతర ఏర్పాట్లపై నేతలు చర్చించారు.
చలో ఢిల్లీ రామలీలా మార్చ్
చలో ఢిల్లీ రామలీలా మార్చ్ పేరుతో నిర్వహించనున్న ఈ ర్యాలీ ద్వారా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్ చేయనుంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
ప్రజల భాగస్వామ్యానికి పిలుపు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలతో పాటు పౌర సమాజ ప్రతినిధులు, విద్యార్థులు, యువత, కార్మికులు, గృహిణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు. ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలపై అందరూ కలిసి తమ అభిప్రాయాలను వెల్లడించాలని పిలుపునిచ్చారు.
సీఈసీపై ప్రతిపక్షాల నిరసన కార్యక్రమం వాయిదా
ఇదిలా ఖర్గే నివాసంలో నిర్వహించాల్సిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై ప్రతిపక్షాల ప్రతీకాత్మక పబ్లిక్ ఇంపీచ్మెంట్ కార్యక్రమాన్ని వర్షం కారణంగా వాయిదా వేసినట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. జరగాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడింది.

