తరిగొప్పుల, 19 November
సమస్య పరిష్కారం కోసం ఎమ్మార్పీఎస్ నాయకుడికి బాధితుల వినతి...
మండల కేంద్రంలోని దళితుల భూముల సమస్యను పరిష్కరించి, హక్కుదారులకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు తిప్పారపు లక్ష్మణ్‌ను బాధితులు కోరారు. గురువారం హైదరాబాద్‌లోని ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యను వివరించారు. మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ ఆవరణలోని సర్వే నంబర్ 276లో ఉన్న ఎకరం మూడు గుంటల భూమిని సర్పంచ్ పేరు చెప్పుకొని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత 25 ఏళ్లుగా కేసులు, కోర్టు వ్యవహారాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి, కాంప్లెక్స్ నిర్మాణం పేరుతో తమ భూములకు నష్టం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. స్పందించిన తిప్పారపు లక్ష్మణ్ సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ కల్పించారు. ఈ కార్యక్రమంలో యాటెల్లి సుదర్శనం, దామెర తామస్, యాటెల్లి ఉప్పలయ్య, దామెర ఇసాక్, చింతల జైపాల్, దామెర మైఖేల్ తదితరులు పాల్గొన్నారు.



