కోహెడ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 19
గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయకుండా సిద్దిపేట అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయకుండా సిద్దిపేట అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మండలం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెరుగు నరేందర్ రెడ్డి, నాయకులు జాలిగం శంకర్, ఎండి సైపోద్దీన్, మాంకాల రమేష్, కళ్లికోట రాహుల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో మధ్యలోనే నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి రూ.1,070 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసినందుకు, తెల్లవారుజామునే నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనని వారు అన్నారు. అభివృద్ధి కోసం ప్రశ్నించడం తప్పా ప్రజల తరఫున గొంతెత్తడం నేరమా నిధులు అడిగితే అరెస్టులు చేస్తారా అని వారు ప్రశ్నించారు.
గుర్తుంచుకోండి రేవంత్ రెడ్డి గారు అరెస్టులతో మా గొంతును నొక్కలేరు. సిద్దిపేట జిల్లా అభివృద్ధి కోసం, ప్రజల హక్కుల కోసం మా పోరాటం ఆగదు అని వారు హెచ్చరించారు. ఖబడ్దార్ రేవంత్ రెడ్డి ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పండి అరెస్టులతో కాదు, నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేసి నిరూపించండి అని వారు అన్నారు. సిద్దిపేట అభివృద్ధి మా హక్కు మా పోరాటం ప్రజల కోసం అని వారు అన్నారు.




