కోహెడ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 24
కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్న సిద్ధప్ప వరకవి ఆశ్రమంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిద్ధప్ప వరకవి ట్రస్ట్ చైర్మన్ అనంతవరం మాణిక్యలింగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సిద్ధప్ప వరకవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు.
కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్న సిద్ధప్ప వరకవి ఆశ్రమంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిద్ధప్ప వరకవి ట్రస్ట్ చైర్మన్ అనంతవరం మాణిక్యలింగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సిద్ధప్ప వరకవి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తులసి పూజ, భజనలు, గాయత్రీ యజ్ఞం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిద్ధప్ప వరకవి శిష్యులు మాట్లాడుతూ, గోల్కొండ కవిగా, తెలంగాణ వేమనగా సిద్ధప్ప వరకవి విశేష గుర్తింపు పొందారని కొనియాడారు. ఆయన ఆశయాలను, సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఆశ్రమ అభివృద్ధికి నిధులు కేటాయించి, అభివృద్ధి పనులు చేపట్టడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో సిద్ధప్ప వరకవి విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని జిల్లా శాలివాహన సంఘం అధ్యక్షుడు తరిగొప్పుల రామచంద్రం తెలిపారు.
ఈ వేడుకలకు వందలాది మంది భక్తులు తరలిరాగా, ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి పిల్లి బాబు, మాజీ సర్పంచి సుతారి కనకయ్య, కాంగ్రెస్ నాయకులు భూంపల్లి సంజీవరెడ్డి, సిద్ధప్ప వరకవి కుటుంబ సభ్యులు, శిష్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.







