కొండపాక్, 2026-11-25
అంకిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన కుటుంబాలు ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాలి బాలయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక, వార్డు సభ్యులు బాసుపాల మనీషా, మధుసూదన్, రేకులపల్లి లక్ష్మారెడ్డి, పాలకవర్గ సభ్యులు, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అర్హులైన కుటుంబాలు ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


