సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో సర్పంచ్ గొల్లపల్లి పద్మ ఆంజనేయులు ఆధ్వర్యంలో బుధవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పద్మ మాట్లాడుతూ, 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగి, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అధికారుల భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దివ్య, మండల ప్రత్యేక అధికారి, డీటీ, పంచాయతీ కార్యదర్శి సీహెచ్. కరుణాకర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.







