జనగామ, 19 November
ప్రజాసేవే లక్ష్యంగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని కొర్ర స్వరూప రాజేందర్ నాయక్ వెల్లడి
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కుసుంబాయి గ్రామపంచాయతీ పరిధిలోని జాల్ తండలో మంచినీటి సమస్యను పరిష్కరించినట్లు తెలంగాణ గిరిజన సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు కొర్ర స్వరూప రాజేందర్ నాయక్ తెలిపారు.
జాల్ తండ ప్రజలు గత కొన్నేళ్లుగా మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల సమయంలో ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక చొరవ తీసుకొని తండలో మంచినీటి సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు.
గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో పాటు గ్రామంలోని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం.. ప్రజాసేవే మా లక్ష్యం అనే నినాదంతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని కొర్ర స్వరూప రాజేందర్ నాయక్ స్పష్టం చేశారు.



