జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై పోకల మాన్యత, పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలకు, సిద్దిపేట జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. మద్దూరు మండల కేంద్రంలోని ఈ పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న మాన్యత, తెలంగాణ జట్టు తరఫున గోల్‌కీపర్‌గా జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించనుంది.
ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో మాన్యత అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ నెల 29 వరకు పంజాబ్ రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున బరిలోకి దిగనుంది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కోటా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు ఎంతో గర్వకారణమని అన్నారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
అనంతరం మాన్యతతో పాటు ఆమెకు క్రీడా శిక్షణ అందించిన కళాశాల ఫిజికల్ డైరెక్టర్ దామెర ప్రేమ్ కుమార్‌ను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. మాన్యత మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన పోకల మాన్యత, పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోందని ఉపాధ్యాయ బృందం పేర్కొంది.







