జనగామ, 17 July
జగమపంోోసంచేపసండైమపుుగుంుొసగంచ,ోసంఅంగ700మడైమధుుమంజూుచేయోుతూమూడడుౌసబూడజయోతజుతపతంఅంజేశు.పసతుతంఉపుుమధయోేఆగపోతేభషయతతుోతఇబబంుుతపపఆమఆంోళయతంచేశు.
జనగామ పట్టణంలో వరద నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం హైదరాబాద్ రోడ్డు నుండి గార్లకుంట వరకు నిర్మిస్తున్న స్టాం డ్రైన్ పనులను గార్లకుంట వరకు కొనసాగించాలని, దీనికోసం సుమారు మరో 700 మీటర్ల డ్రైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ మూడవ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జనగామ పట్టణంలోని ఎగువ ప్రాంతాలైన బాణాపురం, రంగప్ప చెరువు, కోర్టు, గిర్నిగడ్డ, రైల్వే స్టేషన్, బీరప్ప గడ్డ, కురుమవాడ, సాయి నగర్, నెహ్రూ పార్క్ ఏరియా తదితర ప్రాంతాల నుంచి వర్షాకాలంలో వచ్చే వరద నీరు, డ్రైనేజీ నీటితో హైదరాబాద్ మెయిన్ రోడ్, బాలాజీ నగర్, జ్యోతి నగర్, సెంట్ మేరీ స్కూల్ ప్రాంతాలు రోజుల తరబడి నీట మునుగుతున్నాయని తెలిపారు. దీనివల్ల ప్రజల ఇళ్లు దెబ్బతినడమే కాకుండా, నిత్యజీవితంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆమె వివరించారు.
ప్రస్తుతం చేపడుతున్న స్టాం వాటర్ డ్రైన్ నిర్మాణం మూడవ వార్డులోని ఎల్లమ్మ గుడి ప్రాంతం వరకే నిధులు మంజూరయ్యాయని, కాలనీ మధ్యలో పనులు ఆగిపోవడం వల్ల భవిష్యత్తులో వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి, ఈ నిర్మాణాన్ని మరో 700 మీటర్ల వరకు కొనసాగించేలా ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఆమె వినతిపత్రంలో పేర్కొన్నారు.










