వరంగల్ జిల్లా కలెక్టర్ ఈ రోజు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. మౌలిక సదుపాయాల కల్పన పురోగతిని ఆయన సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో రహదారుల నిర్మాణం, రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ (ROB) మరియు బ్రిడ్జ్ పనులు, గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నుండి టెక్స్టైల్ పార్క్‌కు రహదారి మార్గం ఏర్పాటు, విద్యుత్ సరఫరా, నీటి వసతి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల పురోగతిని వివరంగా సమీక్షించారు.
పనుల నాణ్యత, వేగం మరియు సమయపాలనపై సంబంధిత అధికారులకు ఆయన తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పార్క్ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వరంగల్ సంధ్యారాణి, ఆర్డీవో సుమ, జిల్లా పరిశ్రమల మేనేజర్ స్వామి, ఆర్ & బి శాఖ అధికారులు, నేషనల్ హైవేస్ అథారిటీ ప్రతినిధులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. అధికారులు తమ తమ శాఖల పరిధిలో జరుగుతున్న పనుల వివరాలను జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందని, ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు.


