కొమురవెల్లి, 2026-11-25
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సహస్ర దీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

శ్రీశైల మల్లికార్జున స్వామి పీఠాధిపతులు చిన్న సిద్ధి రామ పండితారాధ్యులు ఈ దీపోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, మహాహారతి నిర్వహించారు. అనంతరం జ్వాలాతోరణం ప్రజ్వలన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ పవిత్ర కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీకాంత్ రావు, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ పాల్గొన్నారు.
కార్తీక మాసంలో నిర్వహించిన సహస్ర దీపోత్సవం, జ్వాలాతోరణం కార్యక్రమాలతో కొమురవెల్లి క్షేత్రం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.