కొండపాక్, 2026-11-24
కొండపాక గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎల్లమ్మ తల్లి వార్షిక ఉత్సవాలకు బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు.
కొండపాక మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్లమ్మ తల్లి వార్షిక ఉత్సవాల్లో భాగంగా, గౌడ సంఘం ఆహ్వానం మేరకు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాపరెడ్డి, మాజీ జడ్పీటీసీ అనంతుల అశ్వినీ ప్రశాంత్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కాసపురం సంజీవరెడ్డి, అంకిరెడ్డిపల్లి సర్పంచ్ గాలి బాలయ్య, దమ్మకపల్లి సర్పంచ్ లగిశెట్టి జ్యోతి బాలస్వామితో పాటు పలువురు మండల, గ్రామస్థాయి బీఆర్ఎస్ నాయకులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఘన సన్మానం
ఈ సందర్భంగా గౌడ సంఘం నేతలు అంబటి బాలచందర్ గౌడ్, సింగాటం రాములు గౌడ్, సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు బీఆర్ఎస్ నాయకులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎల్లమ్మ తల్లి అమ్మవారి దర్శనం చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.







