సిద్దిపేట, 2026-11-23
పవిత్ర కార్తీక మాసంలో రెండవ సోమవారం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా దీపాలను అలంకరించి, భక్తితో వెలిగించి గంగమ్మ తల్లి ఒడిలో వదిలారు.

కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో విశిష్టత ఉండటంతో మహిళలు పెద్ద సంఖ్యలో కోమటి చెరువు వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దీపాలను నీటిలో వదులుతూ తమ కుటుంబాలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని గంగమ్మ తల్లిని ప్రార్థించారు.
కార్తీక మాసంలో ప్రతి సోమవారానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ మాసంలో దీపారాధన చేయడం వల్ల మనసుకు ప్రశాంతత, కుటుంబానికి శుభం కలుగుతాయని భక్తుల విశ్వాసం.
చెరువు నీటిపై తేలియాడుతున్న దీపాల వెలుగులు ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. భక్తి, సంప్రదాయం, సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ దీపోత్సవం కోమటి చెరువు వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.