సిద్దిపేట, 2026-11-23
ఎస్సీ వర్గీకరణలో మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆరోపించారు.
ఎస్సీ వర్గీకరణలో మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆరోపించారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోస్టర్ విధానంలో మాలలకు కేటాయించిన 22వ పాయింట్‌ను సవరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాలల హక్కులకు భంగం కలిగిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో రోస్టర్ విధానానికి వ్యతిరేకంగా భారీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
సమావేశంలో పాల్గొన్నవారు
ఈ సమావేశంలో రాష్ట్ర బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ, వెన్నరాజు, ఎలుక దేవయ్య, తలారి నరసయ్య, కాల్వ నరేష్, మండల యాదగిరి, మద్దెల చంద్రం, దార మల్లయ్య, దారస్వామి, నిమ్మ నితిన్, పుట్ట రాజు, నూతన జిల్లా అధ్యక్షుడు అరె కిషోర్ తదితరులు పాల్గొన్నారు.



