కుకునూరుపల్లి (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 24
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద మాత్పల్లి గ్రామంలో లబ్ధిదారులకు జీవిత బీమా పత్రాలను పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా కుకునూరుపల్లి మండలం మాత్పల్లి గ్రామంలో లబ్ధిదారులకు జీవిత బీమా పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందూరి అయిలయ్య పాల్గొని, మాత్పల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇందిరమ్మ జీవిత బీమా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని, అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ పథకం ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


