మాన్సింగ్ తండా (ఓరుగల్లు న్యూస్) జూలై 15
మాన్సింగ్ తండా గ్రామంలోని KGBV హాస్టల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన యూనిఫాంలను ASO రాణి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. సర్పంచ్ పద్మ రమేష్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు హాజరై విద్యార్థులకు యూనిఫాంలను అందజేశారు.
మాన్సింగ్ తండా గ్రామంలోని KGBV హాస్టల్లో ప్రభుత్వం అందజేసిన విద్యార్థుల యూనిఫాంలను ASO రాణి ఆధ్వర్యంలో ఘనంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మ రమేష్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు విద్యార్థులకు యూనిఫాంలను అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, KGBV టీచర్లు, హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








