మద్దూరు, 2026-11-21
ఐక్యత, ఆత్మగౌరవం, హక్కుల సాధన లక్ష్యంగా వేడుకలు
ముదిరాజ్ మత్స్యకారుల ఐక్యత, ఆత్మగౌరవం, హక్కుల సాధన లక్ష్యంగా మద్దూరు మండల కేంద్రంలో ముదిరాజ్ మత్స్యకార దినోత్సవాన్ని బోయిని శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బోయిని సిద్ధులు, నారదాసు నరసింహులు, బోయిని మనోహర్, బోయిని రాంబాబు, గాజుల నరసింహులు, గొట్టి పరమేష్, ఇట్టబోయిన మల్లేశం, ఇట్టబోయిన నరసింహులు, పిట్టల నరేష్, బోయిని నరసింహులు, గాజుల చందు, ఇట్టబోయిన రాజు, పోతుల వీరేశం, ఇట్టబోయిన పరమేష్, ఇట్టబోయిన ప్రభాకర్, బోయిని జగన్, బోయిని పవన్ పాల్గొన్నారు.


