జనగామ, 16 July
జనగామ జిల్లా నర్మెట మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 'SIR ఓటర్ నమోదు కార్యక్రమం'పై బీఎల్ఏలతో ఒక ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జనగామ జిల్లా నర్మెట మండలంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు రాజబోయిన జహంగీర్ ఆధ్వర్యంలో 'SIR ఓటర్ నమోదు కార్యక్రమం'పై బీజేపీ పార్టీ బీఎల్ఏలతో ఒక ముఖ్య సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ 'SIR జనగామ జిల్లా కన్వీనర్' బొజ్జపల్లి సుభాష్, జనగామ జిల్లా నాయకులు బల్ల శ్రీనివాస్, గాజుల సంపత్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ, 'SIR ఓటర్ నమోదు కార్యక్రమంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని' సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మెతుకు సిద్ధులు, మాజీ మండల అధ్యక్షులు రంగు మురళి, కిసాన్ సెల్ జిల్లా మాజీ కార్యదర్శి బైరగొని ఆంజనేయులు, ఆనందాస్ నాగరాజు, బూత్ అధ్యక్షులు పెండ్లి శివ తదితరులు పాల్గొన్నారు.









