కర్ణాటక ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ఈ క్రమంలో ఆర్. హితేంద్రను బెంగళూరు నగర కొత్త చీఫ్ పోలీస్ కమిషనర్‌గా నియమించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన సీమంత్ కుమార్ సింగ్‌ను బదిలీ చేసింది.
బెంగళూరు నగర పోలీస్ కమిషనరేట్‌ను సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనే ఐదు విభాగాలుగా పునర్వ్యవస్థీకరించింది. ఈ ఐదు విభాగాలకు వేర్వేరు పోలీస్ కమిషనర్లను నియమించింది. నగరంలో పెరుగుతున్న జనాభా, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యలు, శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలనే లక్ష్యంతో ఈ మార్పులు చేపట్టింది. ఈ పునర్వ్యవస్థీకరణతో బెంగళూరులో పోలీస్ పరిపాలన వికేంద్రీకృత విధానంలో కొనసాగనుంది.


