మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంగీత (30)కు భర్త రవితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యలు, విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంపైకి సంగీత ఎక్కింది. ఆమె భవనం పై నుంచి దూకుతానని హెచ్చరించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. సుమారు గంటపాటు ఫోన్ ద్వారా, ప్రత్యక్షంగా నచ్చజెప్పినా ఆమె కిందికి దిగేందుకు అంగీకరించలేదు. స్థానికులు, కుటుంబ సభ్యులు కూడా ఆమెను వారించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు యువకులు భవనంపైకి చేరుకుని ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా, ఒక్కసారిగా కిందకు దూకింది. దీంతో ఆమెకు తలకు, రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్‌లో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఓరుగల్లు న్యూస్: నిర్మల్ లో విషాదం - కుటుంబ కలహాలతో భవనంపై నుంచి దూకిన వివాహిత
Share:

సారాంశం
మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంగీత (30)కు భర్త రవితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యలు, విభేదాలు కొనసాగుతున్నట్లు స
ముఖ్య విషయాలు
- మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంగీత (30)కు భర్త రవితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
- ఈ నేపథ్యంలో బుధవారం నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంపైకి సంగీత ఎక్కింది.
- ఆమె భవనం పై నుంచి దూకుతానని హెచ్చరించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
- వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు.

