అంతర్జాతీయ మ్యాగజైన్ టైమ్ తొలిసారిగా విడుదల చేసిన 100 నెక్స్ట్ ఇండియా జాబితాలో తొమ్మిది మంది భారత క్రీడాకారులకు చోటు దక్కింది. ఈ జాబితాలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, మహిళల క్రికెట్ ప్రపంచకప్ విజేత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఒలింపిక్ పతక విజేతలు మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్ వంటి ప్రముఖులు ఉన్నారు.
అంతర్జాతీయ మ్యాగజైన్ టైమ్ తొలిసారిగా విడుదల చేసిన 100 నెక్స్ట్ ఇండియా జాబితాలో తొమ్మిది మంది భారత క్రీడాకారులకు చోటు దక్కింది. ఈ జాబితాలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, మహిళల క్రికెట్ ప్రపంచకప్ విజేత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఒలింపిక్ పతక విజేతలు మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్ ఉన్నారు. అలాగే ప్రపంచ చెస్ ఛాంపియన్ డి. గుకేశ్, అథ్లెట్ విథ్యా రామరాజ్, ఆర్చరీ క్రీడాకారిణి కుమ్కుమ్ మొహోడ్, భారత మహిళల హాకీ గోల్‌కీపర్ సవితా పూనియా, టెన్నిస్ మాజీ క్రీడాకారిణి సానియా మీర్జా ఈ జాబితాలో స్థానం సంపాదించారు.
వివిధ విభాగాల్లో వీరికి గుర్తింపు లభించింది. వైభవ్ సూర్యవంశీ, మీరాబాయి చాను, కుమ్కుమ్ మొహోడ్లకు ఇన్నోవేటర్స్ విభాగంలో చోటు దక్కింది. లవ్లీనా బోర్గోహైన్, డి. గుకేశ్, విథ్యా రామరాజ్ ఫినామ్స్ విభాగంలో నిలిచారు. సవితా పూనియా లీడర్స్ విభాగంలో, హర్మన్‌ప్రీత్ కౌర్, సానియా మీర్జా అడ్వకేట్స్ విభాగంలో చోటు సంపాదించుకున్నారు.
వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతూ దేశ భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు టైమ్ ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో స్థానం పొందడం భారత క్రీడాకారులకు దక్కిన గొప్ప గౌరవంగా పరిగణించబడుతోంది.






