భారత్‌కు చెందిన 11 వేలకు పైగా స్టార్టప్‌ల నుంచి ఎంపికైన పది సంస్థలు యూఏఈలో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధమయ్యాయి. యూఏఈఇండియా స్టార్టప్ సిరీస్ 2.0 కార్యక్రమంలో భాగంగా, ఈ పది స్టార్టప్‌లు 18 తేదీల్లో బెంగళూరులో నిర్వహించే ఫైనల్ పిచ్ కార్యక్రమంలో తమ వ్యాపార ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలను ప్రదర్శించనున్నాయి.
కృత్రిమ మేధస్సు, ఇంధన రంగం, పర్యావరణ పరిరక్షణ, డీప్‌టెక్, రోబోటిక్స్, డిజిటల్ ఆస్తులు వంటి విభాగాలకు చెందిన సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఎంపికైన సంస్థలకు అబుదాబిలోని హబ్71 సంస్థ ద్వారా పెట్టుబడిదారులతో పరిచయాలు, మార్గదర్శకత్వం, యూఏఈ మార్కెట్లో వ్యాపార విస్తరణకు అవసరమైన సహకారం లభించనుంది. ఈ కార్యక్రమం ద్వారా భారత స్టార్టప్‌లకు అంతర్జాతీయ మార్కెట్లలో తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.


