రూ.2,000 పైబడిన యూపీఐ చెల్లింపులపై 0.4% మర్చంట్ డిస్కౌంట్ రేటు విధించే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది.
రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధన రంగాల్లో రూ.2,000కు మించిన చెల్లింపులకు ఒక్కో లావాదేవీపై రూ.5 ఫ్లాట్ ఛార్జీ ప్రతిపాదించారు. అయితే ఈ మొత్తాన్ని వినియోగదారులు కాకుండా వ్యాపారులే చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ బదిలీలు, రూ.2,000 వరకు వ్యాపార చెల్లింపులు, అర్హత కలిగిన చిన్న వ్యాపారుల లావాదేవీలకు ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ విధానం అమలు కావాల్సి ఉండగా, దీపావళి పండుగ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా () దీనిని వాయిదా వేసింది. కొత్త అమలు తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో, చెల్లింపుల సంస్థలు త్వరగా స్పష్టత ఇవ్వాలని , ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరుతున్నాయి. ఈ ప్రతిపాదిత మార్పులు డిజిటల్ చెల్లింపుల స్వీకరణపై ప్రభావం చూపుతాయని పరిశీలకులు భావిస్తున్నారు.


