పలు, 2 ఏప్రిల్ 2026
పంజాబ్‌లో రైల్వే ట్రాక్‌పై జరిగిన పేలుడు కేసులో కీలక నిందితుడు సురీందర్ సింగ్ అలియాస్ థిక్రీవాల్ను జాతీయ దర్యాప్తు సంస్థ () అరెస్ట్ చేసింది. అమెరికా నుంచి భారత్‌కు డిపోర్ట్ అయిన అతడిని ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.
నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్ ()కు మద్దతుదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సురీందర్ సింగ్ అలియాస్ థిక్రీవాల్ను అరెస్ట్ చేసింది. అమెరికా అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని భారత్‌కు డిపోర్ట్ చేయగా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
సోషల్ మీడియాలో వీడియో ఆధారంగా దర్యాప్తు
పేలుడు ఘటన తర్వాత సురీందర్ సింగ్ తన ఫేస్బుక్ ఖాతాలో ఘటనను సమర్థిస్తూ, అందులో పాల్గొన్న నిందితులకు మద్దతుగా వీడియో పోస్ట్ చేసినట్లు దర్యాప్తులో గుర్తించింది. అందులో మరణించిన జగ్రూప్ సింగ్‌కు కూడా మద్దతు తెలిపినట్లు అధికారులు పేర్కొన్నారు. ను ప్రశంసిస్తూ, ఆ సంస్థకు చెందిన రంజీత్ సింగ్ అలియాస్ నీతాను నాయకుడిగా అభివర్ణించినట్లు తెలిపింది.
దర్యాప్తులో భాగంగా సురీందర్ సింగ్‌పై లుక్అవుట్ సర్క్యులర్ () జారీ చేశారు. పంజాబ్‌లోని పలు జిల్లాల్లో అతడిపై ఇతర క్రిమినల్ కేసులు కూడా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
కేసులో మొత్తం ఎనిమిది మంది అరెస్ట్
సురీందర్ సింగ్ అరెస్టుతో రాజ్పురాషంభు రైల్వే పేలుడు కేసులో ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ కుట్ర వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, విదేశాల్లోని అనుబంధ నెట్‌వర్క్‌లు, వాటి ఆర్థిక, ఇతర సహాయ మార్గాలపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది.
పంజాబ్‌లో రైల్వే ట్రాక్‌పై జరిగిన పేలుడు కేసులో కీలక నిందితుడు సురీందర్ సింగ్ అలియాస్ థిక్రీవాల్ను జాతీయ దర్యాప్తు సంస్థ () అరెస్ట్ చేసింది. అమెరికా నుంచి భారత్‌కు డిపోర్ట్ అయిన అతడిని ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు
పంజాబ్ రైల్వే పేలుడు కేసులో ఎవరు అరెస్ట్ అయ్యారు?
పంజాబ్ రైల్వే పేలుడు కేసులో కీలక నిందితుడు సురీందర్ సింగ్ అలియాస్ థిక్రీవాల్ను NIA అరెస్ట్ చేసింది.
సురీందర్ సింగ్‌ను ఎక్కడ అరెస్ట్ చేశారు?
అమెరికా నుంచి భారత్‌కు డిపోర్ట్ అయిన సురీందర్ సింగ్‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు.


