అల్వాల్, 2026-11-25
అల్వాల్ సర్కిల్, మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని ప్రెసిడెన్సీ కాలనీలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను డీఈ మహేష్ పరిశీలించారు. కాలనీలో ఆయన కలియతిరిగారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఏఈ రవళి, అఫ్రోజ్ ఉన్నారు.
అల్వాల్ సర్కిల్, మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని ప్రెసిడెన్సీ కాలనీలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను డీఈ మహేష్ పరిశీలించారు. కాలనీలో ఆయన కలియతిరిగారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఏఈ రవళి, అఫ్రోజ్ ఉన్నారు.
ఓపెన్ జిమ్, రోడ్ల మరమ్మతులు
ఇటీవల కాలనీ పార్క్‌లో రూ. 12,50,000 తో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను డీఈ మహేష్ సందర్శించారు. జిమ్‌లో లైట్లు ఏర్పాటు చేయాలని ఏఈ రమేష్‌ను ఆదేశించారు. అక్కడక్కడా రోడ్లపై ఏర్పడిన గుంతలను చూసి, ప్యాచ్‌వర్క్ చేయాలని సూచించారు.
డ్రైనేజీ సమస్య పరిష్కారం
కాలనీవాసులు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న డ్రైనేజీకి పైకప్పు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్రా శ్రీనివాస్ రెడ్డి, కులకర్ణి, బంగరు రెడ్డి, ఆలీ, యూసుఫ్, గోనె శ్రీనివాస్ రెడ్డి, రాజా రెడ్డి, నర్సింహ రెడ్డి, శ్రీవర్ధన్ రెడ్డి, కృష్ణ రెడ్డి, విష్ణు రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



