25 నవంబర్ 26 ఓరుగల్లు న్యూస్ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 25
సిద్దిపేట పట్టణంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలని, ఆర్థిక సమ్మిళిత పథకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సూచించారు. యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక సమ్మిళిత ప్రచార కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పట్టణంలోని ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలని, ఆర్థిక సమ్మిళిత పథకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సూచించారు. బ్యాంకింగ్ సేవల ప్రయోజనాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు.
సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో యూనియన్ బ్యాంక్ రీజినల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్థిక సమ్మిళిత పథకాల సంపూర్ణ అమలు ప్రచార కార్యక్రమానికి కమిషనర్ మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ రీజినల్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా ఆడిట్ అధికారి జయశ్రీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అధికారుల సూచనలు
అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండటం ద్వారా ప్రభుత్వ ఆర్థిక పథకాల ప్రయోజనాలు పొందడంతో పాటు బీమా, వ్యక్తిగత రుణాలు, రైతు రుణాలు, గృహ రుణాలు వంటి అనేక బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఆర్థిక పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని మెప్మా ఆర్పీలకు సూచించారు. బ్యాంకింగ్ సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు క్షేత్రస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ హన్మంతరెడ్డి, నాబార్డ్ అధికారి నిఖిల్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ మేనేజర్లు, పట్టణ మెప్మా అధికారులు సంతోషి మాత, జ్యోతి, పట్టణ ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.


