దవాఖానను (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 26
పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ), కేసీఆర్ నగర్ బస్తీ దవాఖానను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సీహెచ్. ధనరాజ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ నగర్ యూపీహెచ్‌సీలోని ల్యాబ్, ఫార్మసీ స్టోర్‌తో పాటు వివిధ రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, రోగులకు అందుతున్న చికిత్స వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ నగర్ బస్తీ దవాఖానను సందర్శించి అక్కడి వైద్య సేవలను పరిశీలించారు.
అధికారులకు సూచనలు
ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అర్హులైన ప్రజలకు అసంక్రమిత వ్యాధుల () స్క్రీనింగ్ పరీక్షలను అధిక సంఖ్యలో నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
అర్హులైన పిల్లలందరికీ 100 శాతం వ్యాధి నిరోధక టీకాలు అందించేలా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ () కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. ఆరోగ్య కార్యక్రమాల అమలుపై పర్యవేక్షక సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
అన్ని జాతీయ, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని, అత్యవసర మందులతో పాటు అవసరమైన అన్ని రకాల మందులను తగినంత నిల్వలో ఉంచుకోవాలని ఆదేశించారు. సిబ్బంది విధులకు సమయపాలన పాటిస్తూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.



