20 నవంబర్ 26 ఓరుగల్లు న్యూస్ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 20
సిద్దిపేటలో ముస్తాబాద్ చౌరస్తా వద్ద బుచ్చిబాబు సీ ఫుడ్స్ ప్రత్యేకంగా సముద్రపు చేపలను విక్రయిస్తోంది, కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం నుండి నేరుగా నాణ్యమైన చేపలను సరఫరా చేస్తున్నారు.
సిద్దిపేట పట్టణ ప్రజలకు వివిధ రకాల సముద్రపు చేపలను అందుబాటులోకి తీసుకువస్తూ ముస్తాబాద్ చౌరస్తా, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బుచ్చిబాబు సీ ఫుడ్స్ ప్రత్యేకంగా చేపల విక్రయాలు నిర్వహిస్తోంది. కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం వంటి తీర ప్రాంతాల నుంచి నాణ్యమైన చేపలను సిద్దిపేటకు నేరుగా సరఫరా చేస్తూ ప్రజలకు అందిస్తున్నారు.
బుచ్చిబాబు సీ ఫుడ్స్‌లో ఇండియన్ సాల్మన్, ఎల్లోఫిన్ ట్యూనా, పండు గప్ప, వజ్రం ఫిష్, ఎలాస్ ఫిష్, బ్లాక్ పాంప్లెట్, చుక్కల బొంత, శీలావతి, తెగువ, పవన్ చేపలు వంటి వివిధ రకాల సముద్రపు చేపలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి బుధవారం, శనివారం, ఆదివారం ప్రత్యేకంగా సీ ఫుడ్స్ లభిస్తుండగా, ప్రతిరోజూ డ్రై ఫిష్, ఫ్రెష్ ఫిష్, డ్రై ప్రాన్స్ కూడా విక్రయిస్తున్నారు.
వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా వంటకాలు
చేపలను కొనుగోలు చేసే వినియోగదారుల కోసం వివిధ రకాల చేపలతో పాటు, వారి అభిరుచికి అనుగుణంగా వండిన వంటకాలను కూడా తయారు చేసి అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చేపల్లో ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో, సమతుల్య ఆహారంలో భాగంగా చేపలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు సహా అన్ని వయసుల వారు పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం మంచిదని తెలిపారు.
సిద్దిపేట పట్టణ ప్రజలు ఇకపై సముద్రపు చేపల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్థానికంగానే వివిధ రకాల చేపలను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని బుచ్చిబాబు సీ ఫుడ్స్ నిర్వాహకులు వెల్లడించారు. చేపల ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.







