హుస్నాబాద్, 2026-11-22
తెలంగాణ తత్వకవి సిద్దప్ప వరకవి రాజయోగి జీవిత, సాహిత్య విశేషాలతో ప్రముఖ కవి సుప్పని సత్యనారాయణ రచించిన శ్రీ శ్రీ శ్రీ సిద్దప్ప వరకవి రాజయోగి శతపద కవితాస్తుతి పుస్తకావిష్కరణ ఈ నెల 24వ తేదీ కార్తిక పౌర్ణమి రోజున గుండారెడ్డిపల్లి గ్రామంలోని సిద్ధప్ప ఆశ్రమంలో జరగనుంది.
ఈ విషయాన్ని సిద్దప్ప కుమారుడు అనంతవరం మాణిక్య లింగం ఒక ప్రకటనలో తెలిపారు. సాహిత్య అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.


