తాత సంపాదించిన ఆస్తిలో మనవడికి నేరుగా హక్కు ఉండదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తండ్రికి తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిలో కుమారుడికి జన్మతః హక్కు ఉండదని స్పష్టం చేసింది.
హిందూ వారసత్వ చట్టంలోని నిబంధనల ప్రకారం ఆస్తి స్వభావం, అది సంక్రమించిన విధానం ఆధారంగా వారసత్వ హక్కులు నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొంది. తాత నుంచి తండ్రికి వచ్చిన ఆస్తి ప్రతి సందర్భంలోనూ పూర్వీకుల ఉమ్మడి ఆస్తిగా పరిగణించలేమని వివరించింది. అందువల్ల తండ్రి ఆస్తిలో కుమారుడికి ఆటోమేటిక్గా వాటా లభించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆస్తి స్వభావం, వీలునామా, వారసత్వ పరిస్థితులను బట్టి హక్కులు మారవచ్చని ఈ తీర్పు సూచిస్తోంది.

