వరంగల్, 13 September
వరంగల్ పోలీస్ కమిషనరేట్లో క్యాంపు క్లర్క్ (సీసీ) వేణుగోపాల్ రావు, పౌర సంబంధాల అధికారి (పీఆర్వో) మోహన కృష్ణలను బదిలీ చేశారు. వారి స్థానంలో కొత్త అధికారులను నియమిస్తూ పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్యాంపు క్లర్క్ (సీసీ) వేణుగోపాల్ రావు, పౌర సంబంధాల అధికారి (పీఆర్వో) మోహన కృష్ణలపై బదిలీ వేటు పడింది. వారి స్థానంలో స్పెషల్ బ్రాంచ్ విభాగంలో పనిచేస్తున్న ఏవో ఇషాక్ను కొత్త సీసీగా, సుబేదారి పీఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ తిరుపతిని పీఆర్వోగా పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత నియమించారు. ఈ మేరకు శనివారం పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.

