జనగామలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అండర్-14, అండర్-17 బాలబాలికల ఫూట్ బాల్ పాఠశాల క్రీడల ఎంపికలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఎంపికల్లో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 250 మంది బాలురు, 150 మంది బాలికలు పాల్గొని తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. ఎంపికలకు హాజరైన క్రీడాకారులకు, పీఈటీలు, పీడీలకు భోజన వసతి కల్పించారు. ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో నిర్వహించే అండర్-14, అండర్-17 బాలబాలికల పాఠశాల క్రీడల రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొంటారని జనగామ జిల్లా పాఠశాల సమైక్య క్రీడల కార్యదర్శి జాటోత్ గోర్ సింగ్ తెలిపారు. క్రీడాకారులకు గౌసియా బేగం దిశానిర్దేశం ప్రారంభ సమావేశంలో జనగామ జిల్లా జిసిడివో అధికారి గౌసియా బేగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడాకారులు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఎంపికలకు ఎంపికై, తమ ప్రాంతానికి, తల్లిదండ్రులకు, వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడా రంగంలో సాధించిన సర్టిఫికెట్లు భవిష్యత్తులో 2 శాతం స్పోర్ట్స్ రిజర్వేషన్ వంటి అవకాశాలకు ఉపయోగపడతాయని ఆమె క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. అండర్-19 పాఠశాల క్రీడల జనగామ జిల్లా కార్యదర్శి అజ్మీర కిషన్ నాయక్ మాట్లాడుతూ, ఇలాంటి జిల్లా స్థాయి ఎంపికలు స్థానికంగా ఉన్న క్రీడాకారులకు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తాయని తెలిపారు.జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్, రవీందర్ మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు క్రమశిక్షణతో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాలను చక్కగా ప్రదర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోచ్ లింగ్య నాయక్, వేణు మాధవ్ రావు, వేణు, అర్పిత, దస్రు నాయక్, ప్రేమ్ కుమార్, రవి బండారి, కిరణ్ కుమార్, లచ్చిరాం, వీర్య నాయక్, మనోజ్ కుమార్, కిరణ్ కుమార్, అశోక్ కుమార్ తదితరులతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఆరు జిల్లాల నుంచి సుమారు 60 మంది వ్యాయామ దర్శకులు, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా స్థాయి ఫుట్ బాల్ ఎంపికలు
Share:

సారాంశం
జనగామలో అండర్-14, అండర్-17 బాలబాలికల ఎంపికలు - రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు
ముఖ్య విషయాలు
- జనగామలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అండర్-14, అండర్-17 బాలబాలికల ఫూట్ బాల్ పాఠశాల క్రీడల ఎంపికలు బుధవారం ఘనంగా నిర్వహించారు.
- ఈ ఎంపికల్లో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 250 మంది బాలురు, 150 మంది బాలికలు పాల్గొని తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు.
- ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో నిర్వహించే అండర్-14, అండర్-17 బాలబాలికల పాఠశాల క్రీడల రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొంటారని జనగామ జిల్లా పాఠశాల సమైక్య క్రీడల కార్యదర్శి జాటోత్ గోర్ సింగ్ తెలిపారు.
- క్రీడాకారులకు గౌసియా బేగం దిశానిర్దేశం ప్రారంభ సమావేశంలో జనగామ జిల్లా జిసిడివో అధికారి గౌసియా బేగం పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
303ఆర్టికల్స్
83,907వ్యూస్




